Al-Qari'ah

سورة القارعة

సూరా 101 · మక్కీ · 11 ఆయత్‌లు

101:1జుజ్ 30 · పు. 600

الْقَارِعَةُ1

ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం!
101:2జుజ్ 30 · పు. 600

مَا الْقَارِعَةُ2

ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం?
101:3జుజ్ 30 · పు. 600

وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ3

మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు?
101:4జుజ్ 30 · పు. 600

يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ4

ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.
101:5జుజ్ 30 · పు. 600

وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنْفُوشِ5

మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.
101:6జుజ్ 30 · పు. 600

فَأَمَّا مَنْ ثَقُلَتْ مَوَازِينُهُ6

అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!
101:7జుజ్ 30 · పు. 600

فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ7

అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.
101:8జుజ్ 30 · పు. 600

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ8

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!
101:9జుజ్ 30 · పు. 600

فَأُمُّهُ هَاوِيَةٌ9

అతని నివాసం అధః పాతాళమే.
101:10జుజ్ 30 · పు. 600

وَمَا أَدْرَاكَ مَا هِيَهْ10

మరియు అది ఏమిటో నీకేం తెలుసు?
101:11జుజ్ 30 · పు. 600

نَارٌ حَامِيَةٌ11

అదొక భగభగమండే అగ్ని (గుండం).

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి