Al-Mutaffifin

سورة المطففين

సూరా 83 · మక్కీ · 36 ఆయత్‌లు

83:1జుజ్ 30 · పు. 587

وَيْلٌ لِلْمُطَفِّفِينَ1

కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.
83:2జుజ్ 30 · పు. 587

الَّذِينَ إِذَا اكْتَالُوا عَلَى النَّاسِ يَسْتَوْفُونَ2

వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.
83:3జుజ్ 30 · పు. 587

وَإِذَا كَالُوهُمْ أَوْ وَزَنُوهُمْ يُخْسِرُونَ3

మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.
83:4జుజ్ 30 · పు. 587

أَلَا يَظُنُّ أُولَٰئِكَ أَنَّهُمْ مَبْعُوثُونَ4

ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?
83:5జుజ్ 30 · పు. 588

لِيَوْمٍ عَظِيمٍ5

ఒక గొప్ప దినమున!
83:6జుజ్ 30 · పు. 588

يَوْمَ يَقُومُ النَّاسُ لِرَبِّ الْعَالَمِينَ6

సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.
83:7జుజ్ 30 · పు. 588

كَلَّا إِنَّ كِتَابَ الْفُجَّارِ لَفِي سِجِّينٍ7

అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.
83:8జుజ్ 30 · పు. 588

وَمَا أَدْرَاكَ مَا سِجِّينٌ8

ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
83:9జుజ్ 30 · పు. 588

كِتَابٌ مَرْقُومٌ9

వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.
83:10జుజ్ 30 · పు. 588

وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ10

సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.
83:11జుజ్ 30 · పు. 588

الَّذِينَ يُكَذِّبُونَ بِيَوْمِ الدِّينِ11

వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!
83:12జుజ్ 30 · పు. 588

وَمَا يُكَذِّبُ بِهِ إِلَّا كُلُّ مُعْتَدٍ أَثِيمٍ12

మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.
83:13జుజ్ 30 · పు. 588

إِذَا تُتْلَىٰ عَلَيْهِ آيَاتُنَا قَالَ أَسَاطِيرُ الْأَوَّلِينَ13

మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
83:14జుజ్ 30 · పు. 588

كَلَّا ۖ بَلْ ۜ رَانَ عَلَىٰ قُلُوبِهِمْ مَا كَانُوا يَكْسِبُونَ14

అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.
83:15జుజ్ 30 · పు. 588

كَلَّا إِنَّهُمْ عَنْ رَبِّهِمْ يَوْمَئِذٍ لَمَحْجُوبُونَ15

అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు.
83:16జుజ్ 30 · పు. 588

ثُمَّ إِنَّهُمْ لَصَالُو الْجَحِيمِ16

తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.
83:17జుజ్ 30 · పు. 588

ثُمَّ يُقَالُ هَٰذَا الَّذِي كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ17

అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.
83:18జుజ్ 30 · పు. 588

كَلَّا إِنَّ كِتَابَ الْأَبْرَارِ لَفِي عِلِّيِّينَ18

అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.
83:19జుజ్ 30 · పు. 588

وَمَا أَدْرَاكَ مَا عِلِّيُّونَ19

మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
83:20జుజ్ 30 · పు. 588

كِتَابٌ مَرْقُومٌ20

అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.
83:21జుజ్ 30 · పు. 588

يَشْهَدُهُ الْمُقَرَّبُونَ21

దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.
83:22జుజ్ 30 · పు. 588

إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ22

నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.
83:23జుజ్ 30 · పు. 588

عَلَى الْأَرَائِكِ يَنْظُرُونَ23

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.
83:24జుజ్ 30 · పు. 588

تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ24

వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.
83:25జుజ్ 30 · పు. 588

يُسْقَوْنَ مِنْ رَحِيقٍ مَخْتُومٍ25

సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.
83:26జుజ్ 30 · పు. 588

خِتَامُهُ مِسْكٌ ۚ وَفِي ذَٰلِكَ فَلْيَتَنَافَسِ الْمُتَنَافِسُونَ26

దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.
83:27జుజ్ 30 · పు. 588

وَمِزَاجُهُ مِنْ تَسْنِيمٍ27

మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.
83:28జుజ్ 30 · పు. 588

عَيْنًا يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ28

అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.
83:29జుజ్ 30 · పు. 588

إِنَّ الَّذِينَ أَجْرَمُوا كَانُوا مِنَ الَّذِينَ آمَنُوا يَضْحَكُونَ29

వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.
83:30జుజ్ 30 · పు. 588

وَإِذَا مَرُّوا بِهِمْ يَتَغَامَزُونَ30

మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.
83:31జుజ్ 30 · పు. 588

وَإِذَا انْقَلَبُوا إِلَىٰ أَهْلِهِمُ انْقَلَبُوا فَكِهِينَ31

మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.
83:32జుజ్ 30 · పు. 588

وَإِذَا رَأَوْهُمْ قَالُوا إِنَّ هَٰؤُلَاءِ لَضَالُّونَ32

మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.
83:33జుజ్ 30 · పు. 588

وَمَا أُرْسِلُوا عَلَيْهِمْ حَافِظِينَ33

మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!
83:34జుజ్ 30 · పు. 589

فَالْيَوْمَ الَّذِينَ آمَنُوا مِنَ الْكُفَّارِ يَضْحَكُونَ34

కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.
83:35జుజ్ 30 · పు. 589

عَلَى الْأَرَائِكِ يَنْظُرُونَ35

ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):
83:36జుజ్ 30 · పు. 589

هَلْ ثُوِّبَ الْكُفَّارُ مَا كَانُوا يَفْعَلُونَ36

"ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి