At-Takwir

سورة التكوير

సూరా 81 · మక్కీ · 29 ఆయత్‌లు

81:1జుజ్ 30 · పు. 586

إِذَا الشَّمْسُ كُوِّرَتْ1

సూర్యుడు (అంధకారంలో) చుట్టి పోయబడి కాంతిహీనుడైనప్పుడు!
81:2జుజ్ 30 · పు. 586

وَإِذَا النُّجُومُ انْكَدَرَتْ2

మరియు నక్షత్రాలు (కాంతిని కోల్పోయి) రాలిపోవునప్పుడు!
81:3జుజ్ 30 · పు. 586

وَإِذَا الْجِبَالُ سُيِّرَتْ3

మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు!
81:4జుజ్ 30 · పు. 586

وَإِذَا الْعِشَارُ عُطِّلَتْ4

మరియు నిండు సూడి ఒంటెలు, నిరపేక్షంగా వదిలివేయబడినప్పుడు!
81:5జుజ్ 30 · పు. 586

وَإِذَا الْوُحُوشُ حُشِرَتْ5

మరియు క్రూరమృగాలన్నీ ఒకచేట సమకూర్చబడినప్పుడు!
81:6జుజ్ 30 · పు. 586

وَإِذَا الْبِحَارُ سُجِّرَتْ6

మరియు సముద్రాలు ఉప్పొంగిపోయి నప్పుడు!
81:7జుజ్ 30 · పు. 586

وَإِذَا النُّفُوسُ زُوِّجَتْ7

మరియు ఆత్మలు (శరీరాలతో) తిరిగి కలుపబడి నప్పుడు!
81:8జుజ్ 30 · పు. 586

وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ8

మరియు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు:
81:9జుజ్ 30 · పు. 586

بِأَيِّ ذَنْبٍ قُتِلَتْ9

ఏ అపరాధానికి తాను హత్య చేయబడిందని?
81:10జుజ్ 30 · పు. 586

وَإِذَا الصُّحُفُ نُشِرَتْ10

మరియు కర్మపత్రాలు తెరువబడినప్పుడు!
81:11జుజ్ 30 · పు. 586

وَإِذَا السَّمَاءُ كُشِطَتْ11

మరియు ఆకాశం ఒలిచి వేయబడినప్పుడు!
81:12జుజ్ 30 · పు. 586

وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ12

మరియు నరకాగ్ని మండించబడినప్పుడు!
81:13జుజ్ 30 · పు. 586

وَإِذَا الْجَنَّةُ أُزْلِفَتْ13

మరియు స్వర్గం దగ్గరకు తీసుకురాబడినప్పుడు!
81:14జుజ్ 30 · పు. 586

عَلِمَتْ نَفْسٌ مَا أَحْضَرَتْ14

ప్రతి ఆత్మ తాను చేసి తెచ్చిన కర్మలను తెలుసుకుంటుంది.
81:15జుజ్ 30 · పు. 586

فَلَا أُقْسِمُ بِالْخُنَّسِ15

అలా కాదు! నేను తొలగిపోయే నక్షత్రాల సాక్షిగా చెబుతున్నాను;
81:16జుజ్ 30 · పు. 586

الْجَوَارِ الْكُنَّسِ16

(ఏవైతే) వేగంగా తిరుగుతూ కనుమరుగవుతున్నాయో!
81:17జుజ్ 30 · పు. 586

وَاللَّيْلِ إِذَا عَسْعَسَ17

మరియు గడచి పోయే రాత్రి సాక్షిగా!
81:18జుజ్ 30 · పు. 586

وَالصُّبْحِ إِذَا تَنَفَّسَ18

మరియు ప్రకాశించే ఉదయం సాక్షిగా!
81:19జుజ్ 30 · పు. 586

إِنَّهُ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ19

నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) గౌరవనీయుడైన సందేశహరుడు తెచ్చిన వాక్కు!
81:20జుజ్ 30 · పు. 586

ذِي قُوَّةٍ عِنْدَ ذِي الْعَرْشِ مَكِينٍ20

అతను (జిబ్రీల్) మహా బలశాలి, సింహాసన (అర్ష్) అధిపతి సన్నిధిలో ఉన్నత స్థానం గలవాడు!
81:21జుజ్ 30 · పు. 586

مُطَاعٍ ثَمَّ أَمِينٍ21

అతని ఆజ్ఞలు పాటింపబడతాయి మరియు (అతను) విశ్వసనీయుడు!
81:22జుజ్ 30 · పు. 586

وَمَا صَاحِبُكُمْ بِمَجْنُونٍ22

మరియు (ఓ ప్రజలారా!) మీ సహచరుడు పిచ్చివాడు కాడు!
81:23జుజ్ 30 · పు. 586

وَلَقَدْ رَآهُ بِالْأُفُقِ الْمُبِينِ23

మరియు వాస్తవంగా, అతను ఆ సందేశహరుణ్ణి (జిబ్రీల్ ను) ప్రకాశవంతమైన దిఙ్మండలంలో చూశాడు.
81:24జుజ్ 30 · పు. 586

وَمَا هُوَ عَلَى الْغَيْبِ بِضَنِينٍ24

మరియు అతను (ముహమ్మద్) అగోచర జ్ఞానాన్ని ప్రజల నుండి దాచేవాడు కాడు.
81:25జుజ్ 30 · పు. 586

وَمَا هُوَ بِقَوْلِ شَيْطَانٍ رَجِيمٍ25

మరియు ఇది (ఈ ఖుర్ఆన్) శపించ (బహిష్కరించ) బడిన షైతాన్ వాక్కు కాదు.
81:26జుజ్ 30 · పు. 586

فَأَيْنَ تَذْهَبُونَ26

మరి మీరు ఎటు పోతున్నారు?
81:27జుజ్ 30 · పు. 586

إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِلْعَالَمِينَ27

ఇది (ఈ ఖుర్ఆన్) సర్వలోకాలకు ఒక హితోపదేశం.
81:28జుజ్ 30 · పు. 586

لِمَنْ شَاءَ مِنْكُمْ أَنْ يَسْتَقِيمَ28

మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.
81:29జుజ్ 30 · పు. 586

وَمَا تَشَاءُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ29

మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.

సూరా ప్రారంభం నుండి ప్లే చేయి